Advertisement
టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మహేష్ బాబు, నమ్రతలు ఐదేళ్లపాటు ప్రేమలో ఉండి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగులో వంశీ, అంజి సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ సినిమాలో నటించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్ లో జరిగింది. ఆ సమయంలో మహేష్ – నమ్రతల మధ్య మంచి స్నేహం కుదిరింది. అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరు వివాహం చేసుకున్నారు.
Advertisement
Read also: యాదమ రాజు ఎంగేజ్మెంట్.. సిగ్గులేదురా ఆమెను చేసుకున్నావ్ అంటూ ట్రోల్లింగ్
Advertisement
అయితే వీరి పెళ్లికి అప్పట్లో కృష్ణ గారు ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వచ్చాయి. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ చివరికి వీరి ప్రేమని ఇంట్లో చెప్పేశారట. కానీ కృష్ణ గారు వీరి వివాహానికి ఒప్పుకోకపోవడంతో మహేష్ సోదరి మంజూలనే వారి కుటుంబ సభ్యులను ఒప్పించిందట. అలా కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా 2005 ఫిబ్రవరి 10 మహేష్ – నమ్రత ఒకటయ్యారు. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నమ్రత మహేష్ బాబు కంటే వయసులో పెద్దది.
అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది. పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. అంతేకాదు మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా నమ్రత అన్ని దగ్గరుండి చూసుకుంటుందట. ఇక మహేష్ బాబుకి షూటింగ్ సమయాలలో ఏ మాత్రం ఖాళీ దొరికిన భార్య, పిల్లలతో గడిపేందుకే ఇష్టపడతారు. పిల్లలను అన్ని రంగాలలో ఎంకరేజ్ చేస్తున్న నమ్రత తన కూతురు సితారతో ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించింది.
Read also: పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజీనావో ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?