Advertisement
కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని మంత్రి రోజా విమర్శలు చేస్తున్నారు. అయితే.. పవన్, నాగబాబును టార్గెట్ చేసుకుంటే పర్లేదు.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న చిరంజీవిని పదేపదే లాగుతుండడం మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో రోజాను ఓ ఆటాడుకుంటున్నారు. ఏ అంశంలో దొరికినా తెగ ట్రోల్ చేస్తున్నారు. మొన్న ఉద్యోగితో చెప్పులు మొయించిన ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే నాగబాబు కూడా రోజాను ఫుల్ టార్గెట్ చేస్తున్నారు.
Advertisement
Also Read: సారీ చెప్పిన కేటీఆర్
ట్విట్టర్ లో డైరెక్ట్ గానే రోజాపై సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నారు నాగబాబు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈయన ట్వీట్ కంటే ముందు రోజా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను పంచుకుంటూ ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు. దానిపైనే నాగబాబు సెటైర్లు వేశారు.
రోజా చేసిన ట్వీట్
నిండ్ర మండలంలో #గడప_గడపకు_మన_ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన త్రాగునీటి బోరు మరియు పైపులైన్లకు ఈరొజు పూజ చేసి ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది. #YSJaganAgain #YSJaganMarkGovernance pic.twitter.com/13i2FtZT3x
Advertisement
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 7, 2023
‘‘నిండ్ర మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన 11 లక్షల నిధులతో మంజూరు చేసిన తాగునీటి బోరు, పైపులైన్లకు పూజ చేసి ప్రారంభించడం జరిగింది. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించింది.’’
Also Read: లోకేష్ ను వెంటాడుతున్న పోలీసులు
రోజా ట్వీట్ పై వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు నాగబాబు. ‘‘హంద్రీనీవా సుజలా స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందినట్లు సమాచారం’’ అని రోజా ఫోటోతో సహా పోస్ట్ పెట్టారు. దీనిపై జనసేన కార్యకర్తలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
హంద్రీనీవా సుజలా స్రవంతి (H N S S) ప్రారంభించిన రోజా @RojaSelvamaniRK
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి ని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజా!
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారం. pic.twitter.com/PXcD9tIurA
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 11, 2023