Advertisement
నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “అన్ స్టాపబుల్ సీజన్ 2” కి ఇటీవల గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగిసింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన మొదటి ఎపిసోడ్ ని విడుదల చేయగా.. ఫిబ్రవరి 9న 2 పార్ట్ ని రిలీజ్ చేశారు. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక రెండవ భాగంలో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పంచుకున్నారు.
Advertisement
Read also: “అత్తారింటికి దారేది” సినిమా లో మన గురూజీ మిస్ అయిన ఈ లాజిక్ గమనించారా ?
Advertisement
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి ఉన్న వ్యాధి గురించి కూడా బయటపడింది. పవన్ కళ్యాణ్ కి 6, 7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆ సమయంలో తన స్నేహితుడు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరిగా మిగిలి పుస్తకాలని తన స్నేహితుడిగా మార్చుకొని పుస్తక పఠన చేసేవారట. అంతేకాదు తన స్నేహితులందరూ ఎప్పుడూ ఆటల్లో రాణిస్తూ ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి ప్రతి ఆటలో కూడా ఫెయిల్ అవుతూ ఉండేవారట. అంతే కాదు పవన్ కళ్యాణ్ కి అసలు స్కూల్ కి వెళ్లాలంటే కూడా ఇష్టం ఉండేది కాదట. ఏ విషయన్నైనా ఎవరూ చెప్పకుండానే తన సొంతంగా కానీ నేర్చుకునే వారట.
ఇక 17 ఏళ్ల వయసులోనే ఎంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఆత్మహత్య చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చారట.ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక అన్నయ్య చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధమయ్యారట. అలా పవన్ కళ్యాణ్ చేతిలో గన్ చూసిన సురేఖ, నాగబాబు ఇద్దరు ఏంటి ఈ పిచ్చి పని అని నిలదీశారట. వెంటనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పి చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే.. ” నువ్వు ఎలాంటి చదువు చదవకపోయినా మాకు అవసరం లేదు. కానీ బ్రతికుంటే చాలు” అని చిరంజీవి చెప్పారట. ఇలా చిన్న వయసులో ఉండగానే పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవాలనే స్టేజి నుండి ప్రస్తుతం ఎంతోమంది జనాలకు ఆదర్శంగా నిలిచారు.
Read also: NTR గారికి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?