Advertisement
ప్రస్తుత కాలంలో సిమ్ కార్డ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తోంది.. అయితే సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం ప్రమాదాల్లో ఇరుక్కునే అవకాశాలుంటాయి. కొంతమంది మనకు తెలియకుండానే మన పేరు మీద సిమ్ కార్డు తీసుకుంటే అది మనకు రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంది. దీనికి కారణం మన పేరు మీద సిమ్ కార్డ్ తీసుకున్న వాళ్లు ఫ్రాడ్ కు పాల్పడతారు. దీనివల్ల ఇబ్బందులు తలెచ్చవచ్చని అంటున్నారు.
Advertisement
అయితే మీ ఆధార్ కార్డు మీద మీకు తెలియకుండా ఏమైనా నెంబర్లు యాక్టివేషన్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోండి.. మొబైల్ లేదంటే కంప్యూటర్ నుంచి చాలా సింపుల్ గా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కేవలం మనం తీసుకున్న మొబైల్ నెంబర్లు మాత్రమే కాకుండా వాటి వివరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్న నెంబర్లు కూడా మనం ఇట్టే తెలుసుకోవచ్చు. టెలికామ్ యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్స్ వాటి వివరాలు యాక్టివేషన్ స్టేటస్ ను పారదర్శకంగా ఉండడం కోసం డిఓటి ఇటీవల ఒక కొత్త వెబ్సైట్లు తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం తీసుకున్నటువంటి మొబైల్ నెంబర్లు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ను కూడా తెలుసుకోవచ్చట.
Advertisement
మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి TAFCOP DGTELECOM. GOV. IN వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. దీని తర్వాత మన వద్ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెంబర్స్ పైన పూర్తి జాబితా అని మనం తెలుసుకోవచ్చు. ఏదైనా నెంబర్ గురించి రిపోర్టు ఓటిపిని ధృవీకరించిన తర్వాత మీ పేరుపై పని చేసే అన్ని మొబైల్ నెంబర్లు నుండి అక్కడ జాబితాను పొందవచ్చు. అయితే ఈ విషయం జమ్ము కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్,రాజస్థాన్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, తెలంగాణ, మేఘాలయ ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.
also read: