Advertisement
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక మూవీస్ లో నటించి కామెడీ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ భరత్.. ప్రస్తుతం భరత్ పెద్దవాడు అయిపోయాడు. కానీ అప్పట్లో భరత్ చేసిన పాత్రలు మనం ఇప్పటికీ చూసిన నవ్వుతూనే ఉంటాం. రెడీ మూవీ లో చిట్టినాయుడు గా భరత్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది. వెంకీ,దూకుడు,కింగ్, రగడ లాంటి చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా భరత్ నటనతో ఎంతో మందికి దగ్గరయ్యాడు.
Advertisement
ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన బాద్ షా సినిమా టైం లో భరత్ చాలా సన్నగా అయిపోయాడు. అలాగే అల్లు శిరీష్ ఏబిసిడి లో కూడా భరత్ ను చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకు అంత సన్నగా అయిపోయాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఎంతోమంది అభిమానుల నుంచి ప్రశ్నలు తలెత్తడంతో.. ఆయన సన్నగా అవ్వడానికి కారణాలు చెప్పాడు. చిన్నప్పటినుండి సినిమాల్లోనే ఉన్నానని, అయినా సరే ఇప్పటికీ మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేశానని, మెడిసిన్ లోనే డాక్టరేట్ చేస్తున్నానని అన్నారు.
Advertisement
Also Read: ముగ్గురు అక్క చెల్లెల్లతో నటించిన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా..?
చెన్నై లోని ఒక కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో నాకు ఆక్సిడెంట్ అయిందని, అప్పటివరకు లావుగా ఉండే నేను ఒక్కసారిగా సన్నగా తయారయ్యానని తెలియజేశాడు. కొన్నాళ్లకు జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక ఐరన్ రాడ్ నా కంటిలో గుచ్చుకోవడం తో కంటిలో బ్లాక్ ఏర్పడి మందులు వాడితేనే తగ్గుతుందని వైద్యులు చెప్పరని భరత్ తెలియజేశారు. అందుకే ఇప్పటికీ ఆ మందులు వాడుతున్నానని కానీ కంటిచూపులో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదని అన్నాడు.