Advertisement
సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ, రెగ్యులర్ షూటింగ్ జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమైందని తెలుస్తోంది.
Advertisement
సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కిస్తున్న సుజిత్ పవన్ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది.ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందు నుండే ఈ మూవీకి సంబంధించి భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించి డైలీ ఏదో ఒక అప్డేట్ వస్తూ అభిమానులను సందడి చేస్తూనే ఉంది. ఈ సందర్బంలోనే మరో కొత్త న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీకి గాను పవన్ కళ్యాణ్ ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. పవన్ సినీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Advertisement
ఈ చిత్రానికి 175 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నట్టు న్యూస్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాన్ కు 75 కోట్ల రూపాయలతో పాటు మూవీ లాభాల్లోనూ వాటా తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను బట్టి చూస్తే పవన్ సుజిత్ సినిమా కోసం ఏకంగా 100 కోట్లకుపైగా తీసుకోనున్నారని టాక్. ఈ సినిమా కనీసం 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తేనే లాభాల బాట పడుతుందని మేకర్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు dvv. దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఓజీ మూవీ పాటలు లేకుండా కేవలం గంటన్నర నిడివితోనే ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read: