Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే, సూపర్ స్టార్ కృష్ణ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు మన టాలీవుడ్ హీరోలకు ఉన్న సెంటిమెంట్లు, ఆహారపు అలవాట్ల గురించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
# ఎన్టీఆర్
నటరత్న ఎన్టీఆర్ కి తెల్లవారుజామున రెండున్నర గంటలకు నిద్ర లేవడం అలవాటు. వెంటనే ఓ చుట్ట కాల్చి, ఫ్రెష్ అయ్యి ఇడ్లీ, దోశలను అది కూడా నెయ్యితో కలిపి తినేవారు. ఇక ప్రతిరోజు ఒక ఫుల్ కోడి ఆయన ఫుడ్ మెనూలో ఉండాల్సిందే. షూటింగ్ లోను బాదంపాలు మొదలుకొని స్వీట్స్, మిరపకాయ బజ్జీలు వంటివి లాగించేసేవారు. ఎంత తిన్న ఇట్టే అరిగించుకోవడం ఆయనకు అలవాటే.
# కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ కి గోంగూర చికెన్, చింతచిగురు మటన్ అంటే పిచ్చి ఇష్టమట. చెన్నై పరిసరాల్లో షూటింగ్ అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి, కాసేపు కునుకు తీసి అప్పుడు మళ్లీ లొకేషన్ కి వెళ్ళిపోయేవారట.
# రజనీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ స్వశక్తితో కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అప్పుడు వేసుకున్న కండక్టర్ యూనిఫామ్ ని జ్ఞాపకంగా దాచుకున్నారు.
# చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి గోధుమ రవ్వ ఉప్మాలో మీగడ కలుపుకొని, ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం అంటే మామూలు ఇష్టం కాదట.
# బాలకృష్ణ
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆమ్లెట్ ఇష్టంగా తింటారు. అలాగే పలు వెజ్, నాన్వెజ్ వంటకాలను కూడా ఇష్టంగా లాగిస్తాడట. బాలయ్యకి నలుపు రంగు అంటే అరిష్టమని సెంటిమెంట్, ఎవరైనా ఆ కలర్ షర్టు వేసుకొని ఎదురుపడ్డారా ఇక అంతే సంగతులు, అలాంటి బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో పూర్తిస్థాయిలో నలుపు రంగు చొక్కా వేసుకోవడం విశేషం.
Advertisement
# నాగార్జున
కింగ్ నాగార్జునకి దైవభక్తి లేదు, దేవుళ్ళను నమ్మడు అంటారు కానీ, ఆయన ‘మానవసేవే మాధవసేవ’ అనే మాటను నమ్ముతాడట. దైవభక్తి తక్కువే కానీ అసలు మొత్తానికి లేకపోలేదు.
# వెంకటేష్
విక్టరీ వెంకటేష్ తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ సెంటిమెంట్ ని కచ్చితంగా పాటిస్తాడట. తన సినిమాలో ఫస్ట్ కాపీ తాలూకా రీళ్లను వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, మద్రాసు వడపళనిలోని కుమారస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో పూజలు జరిపించిన తర్వాతే ప్రదర్శించాలని కోరుకుంటారు. ఇది తండ్రి రామానాయుడు దగ్గర నుంచి వెంకీ అలవరచుకున్న ఆచారం.
# కృష్ణంరాజు-ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నుండి నట వారసత్వంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా అలవడ్డాయి డార్లింగ్ ప్రభాస్ కి. భీమవరం స్టైల్ లో వీరు చేయించే పలురకాల నాన్ వెజ్ వంటకాలు, బిర్యానిలు అదిరిపోతాయని చెప్తుంటారు తిన్నవారు, అలాగే తమ ఇంటి ఫుడ్ ని బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం రుచి చూపించాడు ప్రభాస్. పెద్దనాన్నతో పాటు తాను కూడా భోజన ప్రియుడే మరి.
# మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. ఎంత తినాలో అంతే తింటాను, ఏం కావాలన్నా తినొచ్చు కానీ పద్ధతిగా తినాలి. టైంకి తినాలని చెప్తుంటాడు.
# జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో ఓ డజను ఇడ్లీలను నెయ్యిలో ముంచుకుని తింటుండేవాడని చెప్తుంటారు. తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకున్నారు తారక్, తినడమే కాదు వండడంలోనూ తను బెస్ట్ చెఫ్ అని తన చేతి వంట రుచి చూసిన వారు చెబుతుంటారు. జూనియర్ బిర్యానీ తో పాటు నాన్వెజ్ కర్రీస్ కూడా బాగా చేస్తాడు.
Read also: మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణ గారిని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?