Advertisement
టిడిపి మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది.గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన కొన్ని విషయాలు ఊరటనిస్తున్నాయి. ఆయనకు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో ఆయన హెల్త్ కండిషన్ పై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది.
Advertisement
తారక రత్న భార్యా మరియు కుమార్తెతో పాటుగా నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి మరియు ఇతర కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఆయన బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని, ఇందుకోసం ప్రత్యేక వైద్యులు రంగంలోకి దిగి ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలుస్తోంది. దీని తర్వాత కొన్ని రోజులపాటు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇంతలో మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలిస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం మేరకు బెంగళూరులోని విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
విదేశీ డాక్టర్లను ఎంత ఖర్చు పెట్టైనా ఇక్కడికి రప్పించి చికిత్స అందించాలని భావించిన నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే కొంతమంది వైద్యులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. అయితే తారకరత్న ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తుండగా, ఆయనను స్పృహలోకి తెచ్చేందుకు న్యూరాలజీ నిపుణులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లి తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి అందిస్తున్న సపోర్టు మరువలేనిదని అత్యున్నత వైద్యులను పిలిపించి వైద్యం అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు తారక్. తారక రత్న తొందరగా కోలుకొని పూర్వస్థితికి రావాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
also read: