Advertisement
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కు ఎన్నోసార్లు పెళ్లిళ్లు అవుతూ ఉంటాయి.. అది ఓన్లీ స్క్రీన్ పై మాత్రమే. అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
రోజా- సెల్వమణి:
సెల్వమణి సినీ డైరెక్టర్. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్లింది. తన భర్త డైరెక్షన్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది రోజా. కానీ సెల్వమణి తమిళనాడుకు చెందిన డైరెక్టర్.
నయనతార-విజ్ఞేశ్ శివన్:
గత కొన్నేళ్లుగా నయనతార విగ్నేష్ లు ప్రేమించుకున్నారు. ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒకటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు.
సుహాసిని-మణిరత్నం:
సుహాసిని మణిరత్నం ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇందులో మణిరత్నం దర్శకుడు అయితే సుహాసిని హీరోయిన్.
కుష్బూ-సుందర్:
Advertisement
కుష్బూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా కలియుగ పాండవులు సినిమాలో చేసింది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుందర్ ను పెళ్లి చేసుకుంది.
రమ్యకృష్ణ-కృష్ణవంశీ:
హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణవంశీ ఆయన డైరెక్షన్లో హీరోయిన్ గా చంద్రలేఖ సినిమాలో చేసింది. ఆ తర్వాత ఇద్దరు ఒక్కటై పెళ్లి చేసుకున్నారు.
సూర్య కిరణ్-కళ్యాణి:
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాగార్జున నిర్మాతగా సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యం మూవీతో మెగా ఫోన్ పట్టుకున్నారు సూర్యకిరణ్. అతను ప్రముఖ హీరోయిన్ అయిన కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.
also read: