Advertisement
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తిట్టడంలో ముందుంటారు మంత్రి రోజా. ఒక్కోసారి మెగా ఫ్యామిలీని మొత్తాన్ని టార్గెట్ చేస్తుంటారు. అటు మెగా ఫ్యాన్స్ ఈమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. ఇదంతా తరచూ జరిగే తంతే. అయితే.. తాజాగా విజయవాడలో రోజాకు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
బందర్ రోడ్డులో ఓ షోరూం ప్రారంభోత్సవానికి వెళ్లారు రోజా. ఇదే కార్యక్రమానికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే.. షోరూం దగ్గరకు రోజా కారు రాగానే కొందరు మెగా ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. సీఎం కళ్యాణ్, జై జై కళ్యాణ్ బాబు అంటూ కేకలు వేశారు. అంతేకాదు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ సందడి చేశారు.
Advertisement
రోజా దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా రెచ్చిపోయారు మెగా ఫ్యాన్స్. దీంతో ఆమె ఎవరికీ అభివాదం చేయకుండా సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయారు. రోజాకు పెద్ద అవమానమే జరిగిదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీడియోలు బాగా వైరల్ అవుతుండడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరోవైపు షోరూం లోపల మాత్రం ఎంతో హుషారుగా కనిపించారు రోజా. అనుపమతో కలిసి సందడి చేశారు. ఎక్కడా లభించని కలెక్షన్లు ఇందులో లభిస్తాయని అన్నారు. అందరి అభిరుచి తగ్గట్టుగా అన్ని రకాల సైజులలో నగలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి షోరూం విజయవాడలో పెట్టడం అభినందనీయమని.. ఇకపై విజయవాడ మహిళలు ఆభరణాల కోసం హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు రోజా.