Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. అయితే చిరంజీవి తర్వాత అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే దక్కింది. ఇక చిరంజీవి నట వారసుడిగా తెరంగేట్రం చేసి.. టాలీవుడ్ లో చిరుత వేగంతో దూసుకు వచ్చి.. మగధీరుడిలా రికార్డులు తిరగరాశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. మొదటి చిత్రంతోనే హిట్ అందుకోవడమే కాకుండా.. డాన్స్ లు, ఫైట్లు కూడా అద్భుతంగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.
Advertisement
Read also: DHANUSH MOVIE SIR MOVIE REVIEW: ధనుష్ “సార్” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..మూవీ హిట్టు కొట్టినట్టేనా ?
ఇక మగధీర వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత రచ్చ, నాయక్, ఎవడు వంటి కమర్షియల్ చిత్రాలతో తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చిన రామ్ చరణ్.. రంగస్థలం చిత్రంతో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి సత్తా చాటాడు. ఈ చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాలు నిర్మించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న RC 15 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ మొత్తం రాంచరణ్ ని చెర్రీ అని పిలుస్తానన్న సంగతి తెలిసిందే. తనకి కాలింగ్ సమయం దొరికినప్పుడు ఫ్యామిలీ లైఫ్ కు కూడా సమానంగా టైం కేటాయిస్తూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు చెర్రీ. ఇప్పుడు మనం రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని రేర్ పిక్స్ ని చూద్దాం..
Advertisement

Ram Charan Photos

Ram Charan Photos

Ram Charan Photos

Ram Charan Photos

Ram Charan Photos































