Advertisement
Saar Movie Review : తమిళ హీరో ధనుష్ కి తెలుగులో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ అనువాదం అవుతుంటుంది. అయితే ఈసారి ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ “సార్” అనే మూవీ చేశారు.
Advertisement
Saar Movie Review and Rating in Telugu
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ చిత్రం. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా నటించింది.
మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? “సార్” గా ధనుష్ అలరించారా? అనేది ఈ రివ్యూ లో తెలుసుకుందాం..
Read also: భీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక రెడ్డి గుర్తుందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుందో తెలుసా..?
కథ మరియు వివరణ:
20వ దశకంలో జరిగే కథ ఇది. ఆర్థిక సంస్కరణలతో భారతదేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ చదువులకి డిమాండ్ ఏర్పడుతుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది స్వార్థపరులు విద్యని వ్యాపారంగా మార్చి డబ్బు దండుకోవడం మొదలుపెడతారు. మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే లక్ష్యంగా విద్య పెద్ద వ్యాపారంగా మారుతుంది.
ఈ తరుణంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బాగు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తీసుకురాబోతుందని త్రిపాఠి విద్యాసంస్థల అధినేత ( సముద్రఖని) తనే ప్రభుత్వ విద్యా సంస్థలను దత్తత తీసుకొని అక్కడ తన కాలేజీలలోని జూనియర్ లెక్చరర్స్ ని, ట్యూటర్లని ప్రభుత్వ కాలేజీలకు లెక్చరర్స్ గా పంపిస్తాడు.
నాణ్యతలేని చదువులతో మమ అనిపించి తన వ్యాపారాన్ని కొనసాగించాలనేది అతని వ్యూహం. అలా త్రిపాఠి దగ్గర పని చేస్తూ సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు చెప్పడానికి అపాయింట్ అయిన జూనియర్ లెక్చరరే బాలగంగాధర తిలక్ అలియాస్ బాలు “సార్” (ధనుష్). సిరిపురం జూనియర్ కాలేజీకి మ్యాథ్స్ లెక్చరర్ గా తన ఇద్దరు టీం తో ( హైపర్ ఆది) కలిసి వెళతాడు. అయితే ఆ ప్రాంతంలో కుల వివక్ష ఉంటుంది.
Advertisement
చదువుకోవాల్సిన విద్యార్థులు సరైన లెక్చరర్స్ లేక కూలి పనులు చేస్తుంటారు. విద్యార్థులను మోటివేట్ చేసి కాలేజీకి వచ్చేలా చేస్తాడు బాలు. 100% పాస్ పర్సంటేజీ తో స్టేట్ లోనే నెంబర్ వన్ గా తన కాలేజిని నిలుపుతాడు. అయితే త్రిపాఠి బాలుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో బాలు కి ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి? బయాలజీ లెక్చరర్ మీనాక్షి (సంయుక్త ) బాలుకి ఎలా సాయం చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సినిమా కాన్సెప్ట్ సింపుల్ గా ఉన్నా కూడా తెరపై చాలా ఎమోషనల్ గా కనిపిస్తుంది. భావోద్వేగాలే ప్రధానమైన ఈ కథలో సహజత్వం లేని సన్నివేశాల వల్ల చాలా చోట్ల సినిమా కృతకంగా సాగుతున్న భావన కలుగుతుంది. కులాల మధ్య అంతరాలు తొలగిపోయేలా పిల్లలలో మార్పు తీసుకురావడం వంటి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. మధ్యలో హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా హుందాగా సాగుతుంది.
ఏదో క్లాసులు పీకినట్లుగా కాకుండా కాస్త ఎంటర్టైన్మెంట్ గా, కాస్త ఆలోచింపజేసేలా చెప్పడం సినిమాలో హైలెట్ పాయింట్స్. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా నీట్ గా సాగడం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశం. అయితే సినిమా మొదటి భాగం రఘువరన్ బీటెక్ లా సాగుతోంది.
క్లైమాక్స్ 3 ఇడియట్స్ ని తలపిస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ వాహ్ అనిపించాడు. సినిమాని తన భుజాలపై మోసాడు. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ధనుష్ మరింత దగ్గరవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక త్రిపాటిగా నెగిటివ్ రోల్ కి సముద్రఖని ఆకట్టుకున్నాడు. తనికెళ్ళ భరణి పాత్ర పరవాలేదు. ఇక మిగిలిన పాత్రల నిడివి మేరకు ఓకే అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
ధనుష్ యాక్టింగ్
డైలాగ్స్, మ్యూజిక్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
సాగదీసినట్టుగా కొన్ని ఎపిసోడ్స్
ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
Saar Movie Review రేటింగ్: 3/5
Read also: మీరు ఇప్పటివరకు చూడని రామ్ చరణ్ రేర్ ఫోటో గ్యాలరీ..!!