Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న తెలియని వారు ఉండరు. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపు సాధించారు. ఏం మాయ చేసావే సినిమాతో సమంతతో జతకట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగచైతన్య సమంతాని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వీరు ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు.
Advertisement
వీరు ఏదో కోపంలో అలా చేశారని మళ్ళీ ఒకటవతారని చాలామంది భావించారు. కానీ కొన్ని రోజులకు అది జరిగే అవకాశం లేదని అభిమానులకు కూడా అర్థమైపోయింది. అయితే వీరి విడాకుల అనంతరం మరో అంశం తెర మీదికి వచ్చింది. నాగచైతన్య సమంతాను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునేవాడు అనే ప్రశ్న చాలా మంది అభిమానుల్లో మొదలైంది. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు వారి కుటుంబ సభ్యులు ఆ ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవాలని చూశారట. ఈ విషయాన్ని కొన్ని సందర్భాలలో అక్కినేని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. పూర్వకాలం నుంచే ఎన్టీఆర్, ఏఎన్నార్ కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది.
Advertisement
ఆ స్నేహం నాగార్జున, బాలయ్య మధ్య కూడా కొనసాగింది. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన రెండు కుటుంబాలు తప్పకుండా హాజరయ్యేవారు. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవడానికి బాలయ్య నాగార్జున రెడీ అయినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. బాలయ్య చిన్న కూతురుని నాగచైతన్య కిచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ తరుణంలోని నాగచైతన్య వారి లవ్ మ్యాటర్ బయట పెట్టడంతో వారి వెనక్కి తగ్గారని సమాచారం. నాగచైతన్య సమంతను లవ్ చేయకుంటే ప్రస్తుతం నందమూరి బాలయ్య అల్లుడిగా ఉండేవాడని పలువురు అంటున్నారు.
also read: