Advertisement
మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంది వివిధ రకాల మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఒంటిపై బల్లి పడితే ఏదో అరిష్టంగా భావిస్తారు. బల్లుల విషయంలో గుడ్లగూబల విషయంలో చాలామంది భయంతో ఉంటారు. కొంతమంది పని లేని వారు బల్లులకు సంబంధించి కొన్ని శాస్త్రాలు రాసి జనాల మీదికి వదిలారు. అసలు బల్లి మీద పడితే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
బల్లి మన కలలో కనబడితే ఏదో జరుగుతుంది అనే ప్రచారం జనాల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బల్లి పడిన వెంటనే బంగారం పట్టుకోవాలి అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఇది పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. వాస్తవానికి బల్లి విషపు ప్రాణి.. మన శరీరంపై ఎక్కడ పడినా శుభ్రం చేసుకోవాలీ. ఇక శకునాల విషయానికి వస్తే ఎడమ వైపు బల్లి పడితే ఆడవాళ్లకు శుభం, అదే కుడివైపు పడితే మగాళ్లకు శుభం అని పంచాంగాలు చెబుతూ ఉంటాయి.
Advertisement
కానీ వీటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లేవు. బల్లి శాస్త్రం ప్రకారం బల్లి పడితే ఫలితాలు ఎవరికీ తోచింది వారు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బల్లి తలపై పడితే మరణం అంటారు. కానీ దానికి ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేదు. తొడ మీద పడితే యోగమంటారు. దానికి కూడా ఆధారాలు లేవు. అసలు ఈ మూఢనమ్మకాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అసలు బల్లి మీద పడితే బంగారం పట్టుకోవడం అనేది నిజం కాదు. కంచి లో ఉన్న బంగారు, వెండి బల్లిని ముట్టుకుంటే దోషం ఉండదనే ప్రచారం ఉంది.
also read: