Advertisement
తెలంగాణలో ఉప ఎన్నిక అంటేనే హీట్ పుట్టిస్తుంది. తమ బలం నిరూపించుకోవాలని బీజేపీ, బలగం పెంచుకోవాలని బీఆర్ఎస్, పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తుటాయి. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలోగానీ, అంతకుముందు హుజూరాబాద్, దుబ్బాకలోగానీ ఇదే సీన్ కనిపించింది. అయితే.. తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.
Advertisement
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో ఈయన బాధపడుతున్నారు. ఈనెల 16 నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఆదివారం పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈయన మృతిపట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సాయన్న భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతికి గురైన ఆయన.. అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. సాయన్న పార్దీవదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Advertisement
సాయన్నకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1951 మార్చి 5న జన్మించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలవగా.. 2018లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అయితే.. ఈయన మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఖాళీ అయిన ఆరు నెలల లోపు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జనవరి నాటికి కొత్త ప్రభుత్వం కొలువు దీరాల్సి ఉంటుంది. కనుక ఈ సమయంలో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కష్టమే అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.