Advertisement
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అన్నకి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఓవైపు సినిమాలనే కాకుండా మరోవైపు రాజకీయాల వైపు కూడా బాధ్యతలు చేపట్టాడు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిసారి.. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు ప్రత్యర్థులు. మొదటి భార్య నందిని, రెండవ భార్య రేణు దేశాయ్, మూడో భార్య అన్నా లెజినోవా.. ఇలా పవన్ కళ్యాణ్ కి ముచ్చటగా ముగ్గురు భార్యలు.. మూడు పెళ్లిళ్లు కావడంతో తరచూ ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శల పాలవుతూ ఉంటారు.
Advertisement
Read also: CHIRANJEEVI : ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్
Advertisement
తనతో కలిసి నటించిన రేణు దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి అకిరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేసిన రేణు దేశాయ్.. ఇప్పుడు మళ్లీ సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో రేణు దేశాయ్ ఒక కీలకపాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తరువాత ఆమెకు ఎలాంటి ఆస్తి మరియు డబ్బులని పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అంటూ చాలామంది వాపోయారు.
ఇక అలాంటి వాళ్ళ నోరు మూయించేందుకు త్వరలోనే రేణు దేశాయ్ పేరిట 100 కోట్ల ఆస్తిని రాసిచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అంతే కాదు ఆస్తి తన పిల్లలకు ఉపయోగపడే విధంగా వీలునామాను పవన్ కళ్యాణ్ రాసి ఇవ్వడానికి సిద్ధమయ్యారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ.. ఇక ఆయనను విమర్శించేందుకు ఆస్కారం ఉండదు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.