Advertisement
నందమూరి తారకరత్న రెండు రోజుల కిందట మృతి చెందారు. నారాయణ హృదయాల ఆస్పత్రి లో చికిత్స పొందుతూ, మరణించారు. జనవరి 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర లో గుండెపోటుతో కుప్పకూలిన నందమూరి తారకరత్న శివరాత్రి రోజున మరణించారు. అయితే, నందమూరి తారకరత్న తరహాలో… గుండె పోటుతో మరణించిన సెలబ్రీటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
గర్ కేకే (2022 మే 31) ప్రముఖ గాయకుడు కేకే 53 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. కోల్కత్తాలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కేకే కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస వదిలారు.
సిద్ధార్థ శుక్ల (2021 సెప్టెంబర్ 2) బాలిక వధు, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగొన్న నటుడు సిద్ధార్థ్ శుక్ల 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస వదిలారు.
Advertisement
మేకపాటి గౌతమ రెడ్డి (2022 ఫిబ్రవరి 21) ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు.
సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (2022 నవంబర్ 11) ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వ్యాయామం చేస్తూ చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది.
పునీత్ రాజకుమార్, (2021 అక్టోబర్ 29) కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే లోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు.
రాజు శ్రీ వాత్సవ (2022 సెప్టెంబర్ 21) ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్ కమెడియన్ రాజు శ్రీనివాస్ కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తుండగా శ్రీ వాత్సవ గుండెపోటుకు గురయ్యారు.
Read also: HEALTH TIPS: ఉదయాన్నే లేవగానే మీలో ఈ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..?