Advertisement
ప్రస్తుతం నందమూరి యంగ్ హీరోలలో ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన తర్వాత కళ్యాణ్ రామ్ ఉంటారు.. నందమూరి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు.. అప్పట్లో తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ చాలా సహాయం చేశారట.. ఎన్టీఆర్ నెలకు 4 లక్షల రూపాయలు సహాయం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఒక ఇంటర్వ్యూలో తారకరత్న మాట్లాడుతూ ఈరోజు నా కుటుంబం ఈ విధంగా ఉండటానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని తెలియజేశారు. నా తమ్ముడు లేని పక్షంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తారకరత్న చెప్పుకొచ్చారు. నేను నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి సహాయం అందిందని తెలిపారు. తారకరత్న కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు.
Advertisement
ఇంకోవైపు ఈ ఘటన వల్ల తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయని తెలుస్తోంది.తారక రత్న మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే నందమూరి కుటుంబంలో చోటుచేసుకుంటున్న విషాదఘటనలు వారి కుటుంబ సభ్యులను కూడా ఎంతగానో బాధపెడుతున్నాయి.
also read: