Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు అని మనందరికీ తెలిసిందే. 2008లో జల్సా తో ప్రారంభమైన వీరి ప్రయాణం ఆ తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలకు కూడా కలిసి పనిచేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో, ఇటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయంలో అభిమానులకు ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుల ఎంపికలో, నటించే సినిమాల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతుంది.
Advertisement
Read also: జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?
పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుందని ఆయన చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నారని, కొన్ని రీమేక్ సినిమాలు కూడా ఒప్పుకుంటున్నారని పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు రీమేక్ సినిమాలు చేసి కొన్ని హిట్లు అందుకుంటే ఎక్కువగా ఫ్లాపులు అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు కూడా ఆయన తేరి సినిమా రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారని.. వినోదయ సీతం అనే తమిళ సినిమా రీమేక్ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అందరికీ తెలుసు. అలా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడానికి గల కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ సెలక్షన్ లో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
Advertisement
పవన్ తో సినిమాలను నిర్మిస్తున్న, తెరకెక్కిస్తున్న నిర్మాతలు, దర్శకులు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని.. కానీ ఈ విషయాలను వెల్లడించడానికి మాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే విషయంపై అనేక సందర్భాలలో చర్చ కూడా జరిగింది. అయితే ఇదే విషయంపై తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చేసే బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ స్పందించారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మంచి స్నేహితులనే పేర్కొన్న నాగ వంశీ.. ఒకరి సినిమాల విషయంలో మరొకరి ప్రమేయం ఉండదని, కానీ ఒకరి సినిమాల గురించి ఒకరు చర్చిస్తారని తెలిపారు. అంతే తప్ప ఒకరి సినిమాల మీద మరొకరి ఇన్ఫ్రుయెన్స్ అయితే కచ్చితంగా ఉండదని ఆయన పేర్కొన్నారు.
Read also: CHIRANJEEVI : ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్