Advertisement
టీడీపీ ఆఫీస్ పై వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనిపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుండగా.. టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఎంతో సస్పెన్స్ గా ఈయన్ను అదుపులోకి తీసుకుని.. అంతే సస్పెన్స్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ జరిపిన స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో 10 మంది టీడీపీ నేతలకు కూడా ఇదే రకమైన తీర్పునిచ్చింది.
Advertisement
గన్నవరంలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు పట్టాభి. అయితే.. ఆయన్ను మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ, ఎక్కడికి తీసుకెళ్లారో సస్పెన్స్ కొనసాగించారు. దీంతో ఆయన భార్య చందన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం, డీజీపీదే బాధ్యత అని హెచ్చరించారు. ఇటు చంద్రబాబు నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా పట్టాభి ఇష్యూను హైలైట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై టీడీపీ వర్గీయులు ట్రోల్ కొనసాగించారు. దీంతో సడెన్ గా పట్టాభి గన్నవరం పీఎస్ లో ప్రత్యక్షం అయ్యేలా చేశారు పోలీసులు
Advertisement
అక్కడి నుంచి ఆయన్ను స్థానిక కోర్టులో హాజరుపరిచగా రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అయితే.. స్టేట్ మెంట్ రికార్డు సందర్భంగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ మేజిస్ట్రేట్ ముందు చెప్పారు పట్టాభి. రిమాండ్ కు తరలించే ముందు ఆయనకు చికిత్స అందించాలని మేజిస్ట్రేట్ ను కోరగా.. పట్టాభిని విజయవాడ ఆస్పత్రికి తరలించాలని జడ్జి ఆదేశించారు. చికిత్స కోసం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కేసులో మిగిలిన 10 మంది గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు.
చికిత్స తర్వాత హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజామున 3గంటలకు పట్టాభిని మరోసారి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. చికిత్స అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఇంటి ముందే సుమారు గంటసేపు వాహనంలో వెయిట్ చేశారు. ఆ తర్వాత పట్టాభిని పీఎస్ కి తరలించారు. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. దాన్ని మేజిస్ట్రేట్ కు సమర్పించి.. జడ్డి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.