Advertisement
సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఖతర్ పాప అలియాస్ షాలిని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టిక్ టాక్ వీడియోలతో షాలిని ఎంతో ఫేమస్ అయింది. అలాగే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో బోల్డ్ కంటెంట్ తో మరింత వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈమెను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అసలు ఖతర్ పాపని లవ్ చేసింది ఎవరు? అతను ఈమెని ఎందుకు మోసం చేశాడనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఆస్తి ఎంత? రాజకీయాల కారణంగా ఎంత కోల్పోయారంటే..?
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన శాలినికి రోహిత్ పటాన్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నాను అంటూ రోహిత్ అనే వ్యక్తి షాలిని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెని నమ్మించాడు. అది నిజమని నమ్మిన శాలిని అతనిని ఇష్టపడింది. దీంతో ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. ఫలితంగా శాలిని గర్భం దాల్చింది. దీంతో తనని పెళ్లి చేసుకోవాలని రోహిత్ ని అడగడంతో అతను మాత్రం ముఖం చాటేసాడు.
Advertisement
ఇక ఏం చేయాలో తోచక శాలిని వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రోహిత్ పఠాన్ ఖాన్ పై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడంటూ కంప్లైంట్ చేసింది. తనకి ఇప్పుడు ఐదు నెలల గర్భం అని రోహిత్ పై కంప్లైంట్ చేసింది. ఆమె చేసిన కంప్లైంట్ తో రోహిత్ పై 376 రే** కేసు, 420 చీటింగ్ కేసు నమోదు చేశారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం షాలినిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రోహిత్ – శాలిని ఇద్దరూ కలిసి చాలా వీడియోలు చేసినవి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: పిల్లల ముందు భార్య భర్తలు అస్సలు చెయ్యకూడని పనులు ఇవేనని తెలుసా ?