Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. నందమూరి తారక రామారావు నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం… నందమూరి తారక రామారావు గారికి ఏడుగురు సంతానం. వీరిలో ఏడుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు.
Advertisement
11 మందిలో చిన్నవాడు బాలకృష్ణ. ఈయన చిన్నవాడు కావడంతో అందరికీ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో.. ఆయన భార్య బసవతారకం కొడుకు పెళ్లిపై ఎన్టీఆర్ పై ఒత్తిడి తీసుకువచ్చిందట. ఆమె ఒత్తిడి భరించలేక ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారట. భాస్కర్ రావు తన బంధువైన దేవరపల్లి సూర్యారావు కూతురైన వసుంధరను చూపించాడట. అమ్మాయి అందరికీ నచ్చడంతో 8 డిసెంబర్ 1982లో వసుంధరతో బాలకృష్ణ వివాహం జరిగింది.
Advertisement
దేవరపల్లి సూర్యారావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ ఓనర్. పెళ్లికి కట్నం తీసుకోలేదట.. పెళ్లికూతురు తండ్రి కూతురుకి కానుకగా హైదరాబాదులో 10 లక్షల రూపాయలతో ఇంటిని కట్టించారట. బాలకృష్ణ వసుంధరలకు ముగ్గురు సంతానం కలిగారు. తేజస్విని, బ్రాహ్మణి, కొడుకు మోక్షజ్ఞ. బ్రాహ్మణి వివాహం నారా లోకేష్ తో కాగా తేజస్విని వివాహం గీతం యూనివర్సిటీ ఎండి శ్రీ భరత్ తో అయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
also read: