Advertisement
ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో మొత్తం తెలుగు రాష్ట్రంలో దాదాపుగా 10లోపే థియేటర్లు ఉండేవి. ఇందులో ముఖ్యంగా హైదరాబాదులో మూడు, బెజవాడలో మూడు, తెనాలిలో రెండు , ఇతరాత్రా ప్లేసులలో ఒకటి, రెండు థియేటర్లు ఉండేవట. అయితే ఇందులో ఒకటి రెండు థియేటర్లలో ఎన్టీఆర్ కు భాగస్వామ్యం కూడా ఉండేదట. అప్పట్లో ఒకే టికెట్ మీద పదిమందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వందమందికి 10 టికెట్లు తెంపి వాటికే టాక్స్ కట్టేవారు.
Advertisement
ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు స్లాబ్ సిస్టం పెట్టడమే కాక టికెట్ల రేటు తగ్గించమని ఆదేశాలు జారీ చేశారట. సినిమా పరిశ్రమ నుంచి ప్రతినిధి వర్గం ఆయన దగ్గరికి పోయింది. అందులో దాసరి నారాయణరావు గారు కీలకం. ఏమిటి సమస్య అని అడిగారు. దాసరిని ఉద్దేశించి ఎన్టీఆర్.. అయ్యా ఎగ్జిబిటర్లు భావుర్మంటున్నారు అన్నారు దాసరి… దాసరి గారు.. రాష్ట్రంలో నాకు ఆరు సినిమా హాళ్లు ఉన్నాయి.. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే వారు బాధపడుతుంటే వాన్ని పట్టుకు రండి…
Advertisement
వింటాను అని పంపేశారు.. అలా అన్నగారి పెట్టిన స్లాబ్ పద్ధతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తీసేసారు. ఆయన తీసిన స్లాబ్ తీసేస్తూ.. టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చారు.. 70 రూపాయలుగా ఉన్న బాల్కనీ రేట్ 50 కి తగ్గించారు రాజశేఖర్ రెడ్డి. ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండే ఒక ఆయనకి విజయవాడలో రెండు థియేటర్లు ఉండేవి. వాటిలో టికెట్ల రేట్లు పక్క థియేటర్ల కంటే కాస్త పెంచి వసూలు చేస్తే ఎన్టీఆర్ అతన్ని పిలిపించి మరీ రేట్లు తగ్గించమని వార్నింగ్ ఇచ్చారట.
also read: