Advertisement
ప్రేమికుల రోజు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల రోజు జరుపుకుంటారు. అయితే, ప్రేమికుల రోజు సందర్భంగా హోటల్ బుకింగ్ సేవలు అందించే ఓయోకి మంచి బిజినెస్ జరిగింది. ప్రేమను చూపించుకోవాలని భావించిన ప్రజలతో యాప్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
Advertisement
గతంతో పోలిస్తే ఈసారి ఏకంగా 30% పెరుగుదల కనిపించింది. వీక్ డే అయినప్పటికీ ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం పట్ల ఓయో ప్రతినిధులే ఆశ్చర్యపోతున్నారు. కంపెనీ డేటా ప్రకారం ఏ నగరంలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయో వివరాలు వెల్లడయ్యాయి. ఏ గోవానో లేదా ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయినా మనాలి కాకుండా యూపీలోని బృందావనంలో అత్యధిక రూమ్స్ బుక్కయ్యాయి అంట.
Advertisement
గతేడాదితో పోలిస్తే అక్కడ ఏకంగా 231 శాతం పెరగడం మారిన యువత ఆలోచనకు నిదర్శనమని భావిస్తున్నారు. బెంగళూరు 51%తో రెండో స్థానంలో, హైదరాబాద్ 47%తో మూడో స్థానంలో, 38%తో కోల్కతా ఉన్నాయి. తర్వాత ముంబై, చెన్నై వంటి నగరాలు ఉన్నాయి. బుక్ చేసుకున్న వారు సగటున రెండు రోజులు ఉంటే అది ఈసారి రెట్టింపు అయి నాలుగు రోజులకు పెరగడం. ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడానికి ఖర్చుకు వెనకాడని మధ్యతరగతి జనం కూడా కారణమని భావిస్తున్నట్టు అభిప్రాయపడింది.
Read also: హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయిన మూవీ ఏదంటే ?