Advertisement
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు పాన్ వరల్డ్ లో “ప్రాజెక్ట్ కే” అనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా దీపికా పడుకొన్ నటిస్తుంటే.. మరో కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మహాశివరాత్రి సందర్భంగా శనివారం అనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాని పరీక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
Advertisement
Advertisement
ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలలో ఒకటిగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ స్టోరీ బయటకు వచ్చింది. అదేంటంటే.. అప్పుడెప్పుడో 2012 అనే ఓ హాలీవుడ్ సినిమా వచ్చింది. యుగాంతానికి సంబంధించిన ఫిక్షనల్ స్టోరీ అది. ప్రపంచం అంతమైపోతే ఎలా ఉంటుంది? అసలు ఏమవుతుంది? అనే పాయింట్ తో నడిచిన కథ. అప్పట్లో యుగాంతం గురించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. వాటి స్ఫూర్తితో రాసుకున్న కథ అది. అయితే ఆ తర్వాత యుగాంతం కథని ఎవరూ ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ కే కథ యుగాంతానికి సంబంధించింది అని టాక్ వినిపిస్తోంది.
ప్రాజెక్ట్ కే లో కే అంటే కల్కి, కలియుగం కల్కి అవతారంతోనే అంతం అవుతుంది. ప్రభాస్ పాత్ర కల్కిని పోలి ఉంటుంది. అయితే పురాణాల టచ్ ఎక్కడ ఉండదు. అలాగే సినిమాలోని పాత్రలు, వాటికి పెట్టిన పేర్లు, సందర్భాలు అన్ని పురాణాలతో అనుసంధానంగా ఉండబోతున్నాయి. అయితే ఎక్కడా నేరుగా వాటి ప్రస్తావన ఉండదు. అలా ఈ కథని నాగ్ అశ్విని డిజైన్ చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే టీమ్ లో ఎవరో ఒకరు దీని గురించి స్పష్టం చేయాల్సి ఉంది.
Read also: ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి