Advertisement
హైపర్ ఆది, బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ టీవీ తెరపైకి దూసుకొచ్చిన ఇతను, జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథలు కథలుగా చెప్పుకుంటారనేది తెలిసిందే. స్మాల్ స్క్రీన్ పై హైపర్ ఆదికి మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ లో కేవలం పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ చూపిస్తున్నాడు. అయితే హైపర్ ఆదికి జబర్దస్త్ బాగా కలిసి వచ్చింది.
Advertisement
జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే హైపర్ ఆది సంపాదించాడని తన ఇల్లు, ఆస్తులను సంపాదించాడని వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది సంపాదన మొత్తంగా చూస్తే ఏడాదికి కోటి దాటి పోతుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ మధ్యకాలంలోనే హైపర్ ఆది తన ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఊర్లో ఆయనకున్న ఆస్తుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆది చదువుకునేటప్పుడు చాలా ఖర్చులు అయ్యాయని, అప్పట్లోనే రూ. 20 లక్షల వరకు అప్పు అయిందని గుర్తు చేసుకున్నాడు.
Advertisement
ఈ తరుణంలోని అభి ద్వారా జబర్దస్త్ షోలో అవకాశం అందుకున్నాడు. స్క్రిప్ట్స్ తో నవ్విస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. కానీ గతంలో తమ అప్పులు కట్టడానికి ఉన్న మూడు ఎకరాలు అమ్మేసాడట ఆది వాళ్ళ నాన్న. అయితే ఆది జబర్దస్త్ కు వచ్చిన తర్వాత అదే ఊరిలో మళ్లీ ఏకంగా 16 ఎకరాలు కొన్నాడట. అంతేకాదు తండ్రి చేతికి 10 వేళ్లకు లకు 10 ఉంగరాలు కూడా చేయించాడట. అలాగే హైదరాబాదులోనూ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు.
READ ALSO: “ఖుషి” సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?