Advertisement
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత మరొకరు కన్నుమూస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేకపోతే అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో.. ఎందుకు చనిపోతున్నారు? అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది. అసలు నందమూరి ఫ్యామిలీనే వరుస విషాదాలు ఎందుకు వెంటాడుతున్నాయి? నందమూరి ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఒక్కొక్కరిగా మరణించడం అందరినీ కలచి వేస్తోంది. తాజాగా నందమూరి తారకరత్న కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పటికీ ఎన్నో తీరని విషాదాలు చాలా చోటు చేసుకున్నాయి.
Advertisement
Read also: ఖుషి” సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?
ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం. వాళ్లే జయకృష్ణ, సాయి కృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి. అయితే ఎన్టీఆర్ వారసులలో కొంతమంది ఇప్పుడు ప్రాణాలతో లేరు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. డిసెంబర్ 6న కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద జానకిరామ్ ప్రయత్నిస్తున్న కారు ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. 2018 ఆగస్టు 29న జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక తాజాగా 2022 ఆగస్టు 1వ తేదీన ఉమామహేశ్వరి మరణించారు.
Advertisement
జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలో ఆమె ఆ* చేసుకుని చనిపోయారు. ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు ఈమె నాలుగో కుమార్తె. ఇక గతంలోకి వెళితే ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ 2004లో మరణించారు. అలాగే ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అయితే అతని చిన్నప్పుడే మరణించడం జరిగింది. ఇక 2009లో ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ బతకడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇలా నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
Reada also: ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ధనుష్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి