Advertisement
సాధారణంగా స్త్రీలు గాజులు ధరించడం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. గాజులను మహిళలు వారి యొక్క వైవాహిక జీవితంలో దైవంగా భావిస్తారు. పెళ్లి కాని వారు అయితే అందం, ఆకర్షణ కోసం దరిస్తే, మరి కొంతమంది మహిళలు మరోరకంగా భావిస్తారు ఆ నిజాలేంటో చూద్దాం.. హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారు మరియు వెండి నగలు మహిళలు ధరిస్తే అవి శక్తినిస్తాయి.
Advertisement
అలాగే గాజుల వల్ల కూడా ఎముకల దృఢత్వం అవ్వడమే కాకుండా వాటిలోని సూక్ష్మ పదార్థాల అనువులు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. గాజులను ధరిస్తే మహిళలు వారి భర్తలు ఎక్కువ కాలం జీవిస్తారని కొంతమంది నమ్ముతూ ఉంటారు. మహిళలకు గాజులు లేకపోతే అలంకరణ అసంపూర్తిగా ఉన్నట్టే. హిందువులలో అధిక శాతం మంది మహిళలు గాజులను ఎల్లప్పుడు ధరించి ఉండటంవల్ల వాటి నుంచి వచ్చే శబ్దాలు ఇండ్లలో ఉండే దుష్ట శక్తులను తరుముతాయని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు.
Advertisement
అంతేకాకుండా గాజుల శబ్దాలు ఎక్కువగా వింటే ఆ నివాసం దైవానికి నిలయమని నమ్ముతారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రాచ్యాత్య సంస్కృతికి అలవాటు పడి చాలామంది మహిళలు గాజులు, బొట్టు అసలు ధరించడం లేదు. కానీ గాజులం ధరించడం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు ఊరికే చెప్పలేదు. బంగారు,వెండి గాజులు, మట్టి గాజులు ధరించడం వల్ల స్త్రీలకు అందంతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.
also read: