Advertisement
హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 17న శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.7 కోట్ల విలువైన వజ్రాలతో ఉడయించిన విషయం తెలిసిందే. విశ్వాసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, మాదాపూర్ లో ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారి వద్ద శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
Advertisement
ఈ క్రమంలో ఈనెల 17 అనూష అనే మహిళకు రూ. 50 లక్షల విలువైన వజ్రాభరణాలను ఇచ్చేందుకు రాధిక సేల్స్ మెన్ అక్షయ్ తో కలిసి మధుర నగరకు కారులో వెళ్ళింది. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు రూ.7కోట్ల విలువైన వజ్రాలు ఉన్న కారుతో ఉడయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కారు నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
ఇదే సమయంలో వజ్రాలతో ఉడయించిన శ్రీనివాస్ కారును కూకట్పల్లి సమీపంలోని మెట్రో మాల్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో వదిలిపెట్టారు. అనంతరం నగల బ్యాగు తీసుకుని ఆటోలో రాధిక ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్న తన బైక్ ను తీసుకొని పారిపోయాడు. మొదట శ్రీశైలం వైపు వెళ్లిన శ్రీనివాస్ కాస్తదూరం వెళ్లిన తర్వాత నర్సంపేటలో ఉండే బంధువు ఇంటికి వెళ్ళాడు. తన వద్ద పాత సెల్ఫోన్ ఉంటే పోలీసులకు దొరికిపోతానని భావించిన శ్రీనివాస్ కొత్త ఫోన్ కొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పెట్రోల్ ఖర్చులకోసం రాధిక ఇచ్చిన డెబిట్ కార్డుతో సెల్ఫోన్ కొనుగోలు చేశాడు.
ఆ ఫోను తన బంధువుకి ఇచ్చి అతని వద్ద ఉండే ఫోను తాను తీసుకున్నారు. డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఫోన్ ఐఎంఈ నంబర్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే సొంతఊరు కొవ్వూరు చేరుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 7 కోట్ల విలువైన వజ్రాలను కొట్టేసిన వ్యక్తి 2వేల రూపాయల ఫోన్ ను కొనేందుకు కూడా బాధితురాలు డెబిట్ కార్డును వినియోగించాడు. అలా సెల్ఫోన్ కొనే విషయంలో కూడా శ్రీనివాస్ కక్కుర్తి పడి అడ్డంగా దొరికిపోయాడు.
READ ALSO: వైరల్ అవుతున్న “ప్రాజెక్ట్ కే” స్టోరీ ఇదేనా ? దీనెమ్మ నెక్స్ట్ లెవెల్ అస్సలు !