Advertisement
Tarakaratna Assets: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుండి యువగళం పేరుతో పాదయాత్రని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజు నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న గుండెపోటు కి గురయ్యారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు.
Advertisement
అయితే నందమూరి తారకరత్న మరణించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాగా సినిమాల్లో పెద్దగా రాణించని తారకరత్నకు బిజినెస్ లు ఉన్నట్లు టాక్. అయితే ఆయనకు సంబంధించిన హోటల్ ను గతంలో కూల్చివేశారు అనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. నందమూరి తారకరత్నకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో కబరా డ్రైవ్ ఇన్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉండేది.
Advertisement
ఆ రెస్టారెంట్ 2019లో జిహెచ్ఎంసి అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కొంత భాగం కూల్చేసారట. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న వెళ్లి సమస్య ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారట. అంతేకాకుండా రెస్టారెంట్లో లిక్కర్ కూడా సప్లై చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని
కొందరు కంప్లైంట్ చేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారని సమాచారం. అలా సడన్ గా రెస్టారెంట్ ను కూల్చివేతకు అధికారులు సిద్ధం కావడంతో అక్కడి ఫర్నిచర్, మెటీరియల్ ను షిఫ్ట్ చేసేందుకు వారితో చర్చించి తారకరత్న కొంత సమయం తీసుకున్నారట. తర్వాత ఆ రెస్టారెంట్ ను వేరొక చోటుకు మార్చారట. ఈ విషయం మీడియాలో వైరల్ గా మారింది.
READ ALSO: ఇండియా అబ్బాయి, పాకిస్థానీ అమ్మాయి లూడో గేమ్ లో పరిచయం అయిన వీరిద్దరి లవ్ చివరికి ట్విస్ట్ ఏంటంటే ?