Advertisement
వైసీపీకి కంట్లో నలకలా తయారయ్యారు రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రోజూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారాయన. తాజాగా జగన్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఇచ్చిన హామీలు.. తాను చేసిన పనులను వివరిస్తూ తన ఆవేదనను మీడియా ముందు వివరించారు. ఎమ్మెల్యే రోజురోజుకీ విమర్శల దాడి పెంచడంతో వైసీపీ వర్గాలు కూడా ధీటుగా బదులిస్తున్నాయి.
Advertisement
ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేశారు.. నమ్మకం లేని చోట, అనుమానించిన చోట ఉండకూడదనే తాను అనుకున్నానని స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి. తనపై ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో వేసినా.. భయపడనని చెప్పారు. ఇస్తానన్న నిధులు ఇవ్వకపోవడంపై అడగడమే తప్పయిందని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం తాను మడిమ తిప్పను, భయపడను అని స్పష్టం చేశారు. ఎంతటి వారినైనా ఎదిరిస్తానని తెలిపారు.
Advertisement
గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు శ్రీధర్ రెడ్డి. రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయని, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదని ప్రజల అవస్థలు చూడలేక ప్రభుత్వాన్ని ప్రశ్నించానని చెప్పారు. పొట్టెపాలెం వంతెన నిర్మాణం చేయాలని ఏడాదిన్నర నుంచి డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. అలాగే, ములుమూడి వంతెన, రోడ్లకి రూ.28 కోట్లు ఇస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగానని.. కాంట్రాక్టర్ రెండు కోట్లు ఖర్చు పెట్టారన్నారు ఎమ్మెల్యే. అయితే, ఇంత వరకూ బిల్లులు ఇవ్వలేదని తెలిపారు. కొమ్మరపూడి రైతులకి పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా ఫలితం లేదన్నారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతీసారి తాను ప్రశ్నించడమే కానీ.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.