Advertisement
హిందూమతంలోని మహిళలు… చాలా సాంప్రదాయకంగా మెలుగుతారు. ఎన్నో కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య… మహిళలు జీవనం కొనసాగిస్తారు. ఇందులో ముఖ్యంగా… స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు.
Advertisement
అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతారు. అవి కూడా వెండివే ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడి తో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు. అలా బంగారు పట్టిలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
Advertisement
హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి. లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరు కాళ్లకు ధరించకూడదు అని చెబుతున్నాయి. ఇక సైన్స్ పరంగా చూస్తే వెండి శరీరానికి చలువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి పట్టీలు.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!