Advertisement
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం రావడం, అప్పటికి ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో పోటీని గ్రహించి.. ఆనాడు ఎన్టీఆర్ ను గట్టిగా వాడేసింది టీడీపీ. అచ్చం తాత మాదిరిగా ఖాకీ కలర్ డ్రెస్సులతో ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు తారక్. అయితే.. అంత చేసినా టీడీపీ గెలవలేకపోయింది. ప్రజలు కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు. పార్టీ కార్యకర్తల ఒత్తిళ్ల మేరకు పలు సందర్భాల్లో ప్రెస్ నోట్ లతో సరిపెట్టారు.
Advertisement
అయితే.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జోరుగా సాగుతోంది. దానికి కారణం.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ మాత్రం ఫుల్ ఫైరవుతున్నారు.
Advertisement
తారక్ కు లోకేష్ ఇచ్చిన ఆఫర్ పై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ అధ్యక్ష పదివి ఇచ్చి లోకేష్, చంద్రబాబు పార్టీ నుంచి తప్పుకోవాలని సూచించారు. అలా జరిగితేనే.. టీడీపీలో మార్పు వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లో రావాలని లోకేష్ ఆహ్వానించటం ఏంటి.. తెలుగు దేశం పార్టీని స్థానిపించిందే ఆయన తాత అంటూ గుర్తు చేశారు నాని.
మరో ఫ్రెండ్ వల్లభనేని వంశీ కూడా స్పందించారు. ‘‘తెలుగు దేశం పార్టీని పెట్టింది ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్.. నీ తాత ఖర్జూర నాయుడు కాదు’’ అంటూ సెటైర్లు వేశారు. అసలు నువ్వు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి అంటూ లోకేష్ ని నిలదీశారు.
వీళ్లిద్దరి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్.. కొడాలి నాని ఒక గ్రామ సింహం అంటూ మండిపడ్డారు వర్ల రామయ్య. దేవినేని ఉమ మాట్లాడుతూ… క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తి కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు. బూతులు మాట్లాడినప్పుడు, క్యాసినో డాన్సులు వేయించిన వాడికి పరువు ఉంటుందా? అని ప్రశ్నించారు. 420 గుట్కా నానికి దమ్ముంటే బరిగిసి పిలిస్తే ఎవరు దమ్మేంటో చూసుకుందామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.