Advertisement
సంచలనం రేపిన ప్రీతి ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రీతి తన బాధను తల్లితో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ సంభాషణ బయటకు వచ్చింది.
Advertisement
‘‘సైఫ్ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. నాతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒకటిగా ఉన్నారు. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్ను దూరం పెడతారు’’ అని ప్రీతి చెప్పింది. సైఫ్ తో తాను మాట్లాడతానని.. ఇబ్బంది లేకుండా చేస్తానని తల్లి బదులిచ్చింది. చివరకు అన్ని దారులూ మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Advertisement
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ప్రీతి.. తన సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తోంది. ఇది ఆత్మహత్యాయత్నంగా ప్రచారం జరుగుతున్నా.. ఇతర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.
తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని ప్రీతి తండ్రి చెబుతున్నారు. తమతో మాట్లాడిన తర్వాతే ప్రీతిపై హత్యాయత్నం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ లో తమతో మాట్లాడేటప్పుడు కూడా.. తనను ఏదో చేస్తారనే అనుమానం ఉందని చెప్పిందని తెలిపారు. తమకు కచ్చితంగా న్యాయం జరగాలని ప్రీతి తండ్రి డిమాండ్ చేశారు. సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆయన.