Advertisement
నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి రోజులు గడుస్తున్నా కానీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఆయన మరణం అబద్ధం అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు. కానీ విధిరాతను ఎవరు మార్చలేరు కదా. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తారకరత్న చిన్న వయసులోనే మరణించి తన కుటుంబాన్ని అనాధను చేశారు. దీంతో వారి పిల్లల బాధ్యతలను బాలకృష్ణ చూసుకుంటానని హామీ ఇచ్చారు.
Advertisement
సినిమా తారకరత్న మొదటి సినిమాగా రిలీజ్ అయింది. అశ్విని దత్, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం బాగానే ఆడింది. దీంతో యువరత్న చిత్రాన్ని రిలీజ్ చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తారకరత్న చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. మొదట తారకరత్న అనౌన్స్ చేసిన సినిమాల్లో కొన్ని సగం షూటింగ్ జరుపుకుని ఆగిపోయాయి.
Advertisement
ఇంకొన్ని సినిమాలు అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా అసలు సెకట్స్ పైకి వెళ్లలేదు. ఇక తారకరత్న చేసిన భద్రాద్రి రాముడు, నొ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడానికే చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ సినిమాల ఫలితాలను చూపించి కొంతమంది నిర్మాతలు తారకరత్నతో చేసిన సినిమాలకు పారితోషికాలు ఎగ్గొట్టారట. ఆ సినిమాలకు తారకరత్న అడ్వాన్సులతోనే సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇలా దారుణంగా తారకరత్న మోసపోయాడు.
READ ALSO : ఈశ్వరుడి పూజలో సింధూరం, పసుపు, తులసి దళాలు ఎందుకు వినియోగించారో తెలుసా ?