Advertisement
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన హానికారక ఇంజక్షన్ తీసుకొని ఆ* కు పాల్పడింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి నిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం రోజున కన్నుమూసిన విషయం తెలిసిందే. నిమ్స్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ప్రీతి రాత్రి 9:10 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. హానికారక ఇంజక్షన్ తీసుకొని అపరస్మాలక స్థితిలోకి చేరుకున్న ఆమెకు తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు.
Advertisement
Read also: “తారకరత్న” చనిపోయిన రెండురోజులకి అయన భార్య ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారా ?
అయితే ఆరోగ్యం ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. తొలుత వెంటిలేటర్ పై, అనంతరం ఎక్మో పై చికిత్స అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఐదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి తనువుచాలించింది. అయితే ఆదివారం రోజున ప్రీతి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియో లో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి చెప్పుకొని ఆవేదన చెందింది. ప్రీతిని సైఫ్ ఎంతలా వేధించాడో ఈ ఆడియోను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఆడియో సంభాషణలు ఇవే..
Read also: పుష్ప సినిమాలో “కేశవ” పాత్రని మిస్ చేసుకున్న స్టార్ ఎవరంటే ?
ప్రీతి: ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను.. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు? ఆయనను కూడా పిలిచి మాట్లాడాడు. ఏం మాట్లాడాడో నాకు తెలియదు.
Advertisement
ప్రీతి తల్లి : ఊ.. వాడిని డాడీ ఫోన్ చేయాలి పింకీ ఏం కాదు. వాడిని బెదిరిస్తేనే..
ప్రీతి: నన్ను ఏం చేస్తారో అని అనుకున్నాను.
ప్రీతి తల్లి: నీకు ఏం చేస్తాడు వాడు.
ప్రీతి: సెకండ్ ఇయర్ వాళ్లు అందరూ ఒకటే బ్యాచ్ కదా.. ఇప్పుడు ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చాను అని నన్ను దూరం పెట్టడం ఉంటుంది.
ప్రీతి తల్లి: అది కాదురా ఇప్పుడు.. సెకండ్ ఇయర్ వాళ్లు అందరూ ఒకటేనా..
ప్రీతి: సెకండ్ ఇయర్ అందరూ ఒకటే అంటే.. అందరూ ఆయనలా ఉండరు.
ప్రీతి తల్లి: మరి వాళ్ళు అంటలేరా? అలా ఎందుకు చేస్తావురా అని సెకండ్ ఇయర్ వాళ్లు
ప్రీతి: వాళ్ళు ఎవరు అంటలేరు
ప్రీతి తల్లి: అంటే వీడు.. అంత ఇదా
ప్రీతి: ఆ
ప్రీతి తల్లి: హెచ్ఓడి మాట కూడా వినడా?
ప్రీతి: ఏమో తెలియదు
ప్రీతి తల్లి: ఇప్పుడు నువ్వే పోయి చెప్పినావా?
ప్రీతి: నేనే ఎందుకు పోయి చెప్పినా
ప్రీతి తల్లి: అదీ.. ఇప్పుడు నువ్వే ప్రిన్సిపల్ కి చెప్పినవా? నిన్ను పిలిచిండా?
ప్రీతి: ప్రిన్సిపల్ కి డాడీ ఫోన్ చేసి చెప్పినట్టే.. ఎవరితో చెప్పించిండో డాడీ తెలియదు నాకు
ప్రీతి తల్లి: నిన్ను అక్కడ పిలిపించాడా హెచ్ఓడి?
ప్రీతి: ఆ.. హెచ్ఓడి పిలిచిండు.. పిలిపించి అడిగాడు.. నువ్వు నా దగ్గరికి రావాల్సింది కదా? ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు వెళ్లావు అని అడిగాడు
ప్రీతి తల్లి: ఎవరు హెచ్వోడీనా?
ప్రీతి: ఆ
ప్రీతి తల్లి: అయితే నాకు తెలియదు సార్ నాకుఇట్ల భయం.. వాడు ఎక్కువ ఇది చేస్తున్నాడు అన్నవా?
ప్రీతి: చెప్పినా.. సర్లే నేను తర్వాత మాట్లాడుతా.. పనిలో ఉన్న
ప్రీతి తల్లి: ఏం భయపడకు, ఏం కాదు, అక్కడే ఉన్నాం మనం.. ఎక్కడో దేశంలో కూడా కాదు. ఇక్కడే కదా వరంగల్ లో.. వాడిని చూసుకోవచ్చు మనం. వాడు ఆర్పిఎఫ్ కొడుకా..?
ప్రీతి: రైల్వేలో ఎవరో పని చేస్తున్నారని తెలుసు.. కానీ ఏం చేస్తారో తెలియదు.
Read also: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన రాజమౌళి!