Advertisement
మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ప్రీతిది హత్య..? ఆ*హత్య..? అనే కోణంలో విచారణ చేయాలని జేఏసీ కోరుతోంది. ప్రీతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని హెచ్ఆర్సి లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. గాంధీ నిమ్స్ ఆస్పత్రిలో పోలీసుల వ్యవహార తీరుపై విచారణ చేపట్టాలని తెలియజేసింది.
Advertisement
మరోవైపు తన కుమార్తె ప్రీతిది ఆ* హత్య కాదని హత్యాఅని తండ్రి నరేందర్ ఆరోపణ చేస్తున్నారు. తన కూతురు ఎలా మృతి చెందిందో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కోరారు. కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అనస్థీషియా హెచ్వోడిని సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా నిందితుడైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక ఆ* హత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచిన విషయం అందరికీ తెలుసు. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి కన్ను మూసిన ప్రీతి అంత్యక్రియలు స్వస్థలం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నీ తండాలో ముగిసాయి. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్ ఫై వరంగల్ మట్టేవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 24న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
also read: