Advertisement
తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అనే మూవీతో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే వచ్చిన నువ్వు నేను,జయం, సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆర్పి. ఆ తర్వాత నాగార్జున లాంటి పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి ఆర్పి పట్నాయక్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ చేయకుండా సినిమాల్లో నటించాల్సి రావడం వెనుక ఉన్న విషయం ఏంటో చూద్దాం..
Advertisement
మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఆర్పి ఒక హీరోది మూవీ చేయాల్సి ఉండగా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పిని తీసుకుందామని ఈ పెద్ద హీరో డిసైడ్ అయ్యి ఆర్పి దగ్గరికి వెళ్తే అప్పటికే అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇది నేను చేయలేనని చెప్పారట. దానికి హర్ట్ అయిన పెద్ద హీరో ఆర్పి పట్నాయక్ కి అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఆఫర్స్ లేకపోవడంతో ఈయన కెరియర్ నాశనం చేయడంలో ఆ స్టార్ హీరో ప్రముఖ పాత్ర పోషించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
Advertisement
ముఖ్యంగా ఆ స్టార్ హీరో అల్లుడు సినిమాకి మ్యూజిక్ చేయకపోవడమే ఆర్పి పట్నాయక్ చేసుకున్న పాపమని అన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ స్టార్ హీరో నటించిన రెండు సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్పి పట్నాయక్ తేజ డైరెక్షన్లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింసా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారట. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
also read: