Advertisement
తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ర్యాగింగ్ భూతానికి బలి అయిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి మరణం భాధాకరమని చెప్పారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రీతి మృతికి బాధ్యుడైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వెంకట్ రెడ్డి.
Advertisement
ఇటు నిందితుడికి వత్తాసు పలికిన వారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి.. దర్యాప్తును వేగవంతం చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
మరోవైపు ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. తన స్వాగ్రామం గిర్ని తండాలోని ఇంటికి సమీపంలోని వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. అవివాహిత కావడంతో సంప్రదాయం ప్రకారం చెట్టుతో పెళ్లి చేసిన అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. తల్లిదండ్రులు, బంధువులు ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు.
ప్రీతి అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రీతి పాడె మోశారు. ఇదిలా ఉంటే గిర్నితండాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ఓయూ జేఏసీ ఓ అడుగు ముందుకేసి హెచ్చార్సీని ఆశ్రయించింది. ప్రీతి మృతిపై అనుమానాలను వ్యక్తం చేసింది. పోస్ట్ మార్టం కూడా సరిగ్గా జరగలేదని ఆరోపించింది.