Advertisement
మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ లో ఉంది. ప్రతిపక్షాల లెక్కల ప్రకారం ఏటా 45వేల కోట్ల రూపాయల సంపాదన మద్యం విక్రయాలపైనే ఉందని అంచనా. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ఏర్పాటుతో మద్యం ఏరులై పారుతోంది. అయితే.. కింగ్ ఫిషర్ బీరు బ్రాండ్ తమకు దొరకడం లేదని ఓ యువకుడు కలెక్టర్ ను కోరడం రాష్ట్రవ్యాప్తంగా ఫన్నీ చర్చకు దారితీసింది.
Advertisement
జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని బీరం రాజేష్ అనే యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తమకు కింగ్ ఫిషర్ బీరు అందుబాటులోకి తేవాలని వినతి పత్రాన్ని ఇచ్చాడు. జిల్లాలో కల్తీ మద్యం అమ్ముతున్నారని యూరిక్ యాసిడ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపాడు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని, అందులో ఒక్కో బీరుకు రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నాడు.
Advertisement
యువకుడి ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కల్తీ మద్యంతో ఆరోగ్యం చెడిపోతుందని చెబుతుంటే.. మరికొందరు తాగడం ఎందుకు, బాధపడడం ఎందుకని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే.. కొత్త రకం చర్చలకు దారితీసింది ఈ ఇష్యూ. ఓవైపు అనేక ఘటనలతో రాష్ట్రం అల్లాడుతుంటే.. మద్యం కోసం యువకుడు ఇలా అడగడంపై మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ సంఘటనపై స్పందించారు. ఆ యువకుడ్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వారసుడిగా అభివర్ణించారు. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని ప్రజావాణిలో కోరడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రీతి ఘటన..