Advertisement
పెళ్లి అంటేనే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. నిండు నూరేళ్లు వారు కలకాలం జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన వారు మొదట కొన్నాళ్లు ఓ కలల ప్రపంచం లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఒకరిపైన ఇంకొకరికి అవగాహన తగ్గటం, అర్థం చేసుకోకపోవడమే. వివాహమైన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ జంట జీవితాంతం హ్యాపీ గా ఉంటుంది.
Advertisement
ఇది ఇలా ఉండగా, పెళ్లైన మహిళలు ఎక్కువగా గూగుల్ లో ఎలాంటి వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారని అంశంపై తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. దీంతో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ డేటా ప్రకారం… వివాహిత మహిళలు తమ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకునే మార్గాలను గూగుల్ లో వెతుకుతున్నారు. భర్తకు కావల్సినవి మరియు వారు ఇష్టపడేవి మరియు ఇష్టపడనివి తెలుసుకోవాలనే కోరిక తో ఇలాంటి వివరాలను సెర్చ్ చేస్తున్నారు మహిళలు.
Advertisement
పెళ్లైన ఆడవాళ్ళు తమ భర్త మనసును గెలుచుకుని వాళ్లను ఎలా సంతోష పెట్టాలి అనే ప్రశ్నను కూడా అనేక సార్లు గూగుల్లో చాలాసార్లు వెతికినట్టు తేలింది. ఇంకా… పెళ్లైన మహిళలు తమ భర్తను తమ పిడికిలిలో ఎలా ఉంచుకోవాలి ? అందుకు మార్గం గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు కూడా అధ్యయనంలో తేలింది.
ఇంకా బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అనికూడా గూగుల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో ఎలా ప్రవర్తించాలి? ఆ కుటుంబం లో ఎలా ఉండాలి? అత్తగారితో ఎలా సంతోషంగా ఉండాలి? అని పెళ్లైన మహిళలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా, కుటుంబ బాధ్యతలను ఎలా చూసుకోవాలి? పెళ్లయ్యాక సొంతంగా వ్యాపారం ఎలా సాగించాలి? కుటుంబ వ్యాపారాన్ని ఎలా నడిపించాలో తెలుసుకోవడానికి కూడా గూగుల్ నే ఆశ్రయిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!