Advertisement
టాలీవుడ్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరో ఉదయ్ కిరణ్. ఆ కాలంలోనే చాలామంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటినుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014 న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Also Read: Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 29.06.2022
ఇది ఇలా ఉండగా ఉదయ్ కిరణ్ తో ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ చనిపోయారు అని మీకు తెలుసా.. ఎందుకలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన “నువ్వు-నేను” చిత్రం 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కి హీరోగా మంచి గుర్తింపు లభించింది.
Also Read: సమంత పాత యాడ్స్ వైరల్! అప్పుడు ఎలా ఉందో చూడండి!
Advertisement
ఈ సినిమా ద్వారా విమర్శించే వారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సినిమా. నువ్వు నేను సినిమాకి ఉత్తమ దర్శకుడిగా తేజ కి నంది అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా అన్ని విభాగాల్లో 5 నంది అవార్డులు వచ్చాయి.
అయితే, ఇందులో విషాదం ఏంటంటే.. ఈ మూవీలో హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. MS నారాయణ కూడా చనిపోయారు. ఆహుతి ప్రసాద్ కూడా ఆరోగ్యం బాగా లేక మృతి చెందాడు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆరోగ్యం బాగా లేక ఈయన కూడా చనిపోయాడు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా చనిపోయాడు. ఇలా ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన వారందరూ కూడా మృతి చెందారు.
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?