Advertisement
చిన్న వివాదం.. చినికి చినికి గాలివానలా మారింది. ఎమ్మెల్సీ కోటా విషయంలో మొదలైన పంచాయితీ.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా రాజ్ భవన్ భవన్, ప్రగతి భవన్ వార్ కొనసాగుతోంది. బిల్లుల విషయంలో హర్టయిన తెలంగాణ సర్కార్ గవర్నర్ తమిళిసై తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. పైగా.. ఈ పిటిషన్ పై స్పందించిన గవర్నర్ తగ్గేదే లేదన్నట్టూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఈ వ్యవహారం మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.
Advertisement
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక మొదలుకొని స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ వరకూ ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఈక్రమంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గవర్నర్. ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించిన దస్తావేజులపై సంతకం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, ప్రజా ప్రతినిధులు గవర్నర్ పై విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేసిన గవర్నర్ విధానాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి.
Advertisement
రాజ్ భవన్ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేసి అప్రజాస్వామిక పద్దతిలో విషయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వంలోని కొంతమంది ప్రయత్నించారని స్వయంగా గవర్నర్ తమిళిసై ఆరోపించడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. రిపబ్లిక్ డే వేడుకల సమయంలో పంచాయితీ హైకోర్టు దాకా వెళ్లి.. చివరకు ప్రభుత్వాన్ని షాక్ తగిలట్లయింది. ఆ తర్వాత వెనక్కి తగ్గి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతోనే ముగించారు. దీంతో వివాదాలన్నీ సమసిపోయాయి అని అంతా అనుకున్నారు. కానీ, వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
బిల్లుల విషయంలో తమిళిసై తీరును ప్రశ్నిస్తూ రిట్ పిటిషన్ వేసింది ప్రభుత్వం. బిల్లులు ఓకే చేసేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై తమిళిసై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ ఢిల్లీ కంటే చాలా దగ్గరగా ఉందని, సీఎస్ స్థాయిలో రాజ్ భవన్ కు రావడానికి మీకు టైం దొరకలేదా అని ఎద్దేవ చేశారు. మినిమం ప్రోటోకాల్ ను కూడా పాటించాలని తెలియదా.. కనీసం ఫోన్ కాల్ చేయాలన్న కర్టసీ కూడా లేదా.. అని సీఎస్ ను నిలదీశారు. స్నేహపూర్వకంగా రాజ్ భవన్ కు వచ్చి కలవాలన్న ఆలోచన కూడా లేకపోవడం శోచనీయమన్నారు తమిళి సై.