Advertisement
Rajinikanth Sivaji Movie: ఈ మధ్యకాలంలో సినిమాలు తెరకెక్కించడం కన్నా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా థింక్ చేస్తూ, సినిమాలోని ప్రతి పాయింట్ ని పట్టిస్తున్నారు. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగడం, అవి కాస్త వైరల్ గా మారడం జరుగుతున్నాయి. అలా ఇప్పుడు రజనీకాంత్ సినిమాలోని ఓ లాజిక్ పాయింట్ ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నేటిజెన్లు.
Advertisement
Read also: దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
ఎన్ శంకర్ దర్శకత్వంలో 2007 జూన్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం శివాజీ. ఈ చిత్రంలో రజనీకాంత్, శ్రియ, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎంవిఎం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శివాజీగా రజనీకాంత్ నటన వీర లెవల్ అని చెప్పాలి. ముఖ్యంగా రజిని డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Advertisement
Read also: టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్స్ ! ఎవరు ఎక్కువ అంటే ?
అయితే తాజాగా ఈ చిత్రంలో ఓ చిన్న మిస్టేక్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. విలన్ దృష్టిలో చనిపోయిన తర్వాత రజిని.. ఎన్టీఆర్ (ఎన్టీ రంగారావు) పేరుతో గుండు బాస్ వేషంలో వస్తాడు. అప్పుడు అతను శివాజీ యేనని సుమన్ పోలీస్ ఆఫీసర్ తో చెప్పడంతో.. తను రంగారావే అని, అమెరికా నుండి వచ్చానని నిరూపించుకోవడానికి గ్రీన్ కార్డు చూపిస్తారు.
ఆ కార్డు మీద డేట్ అఫ్ బర్త్.. 30/05/1974, 2010 లో కార్డు నెంబర్ అయితే.. 2007 లో ఎక్స్ పైర్ అయినట్టు ఉంటుంది. దీంతో.. “యూఎస్ నుండి వచ్చేటప్పుడు ఏ పోలీస్ చూసుకోడు? అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీంతో ఎవరికి వారు బుర్రలకు పదును పెట్టి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: Telugu News, Tollywood Movie News in Telugu