Advertisement
శివుడు, అన్ని దేవతల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపం ను మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగ రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి.
Advertisement
Also Read: Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 29.06.2022
అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసు పై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్కపుష్ట భాగమును నిమురుతూ, శృంగము ల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది మధ్య పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరు వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది.
Advertisement
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి. దీన్నే శృంగ దర్శనం అంటారు. రాశిచక్రంలోని మిధున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభ రాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి, మిధున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిధున రాశి, వృషభ రాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వల్లనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు) యొక్క వృషభ భాగాన్ని స్ప్రుషిస్తూ శివుని దర్శించడం వల్ల విధివీహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణాలలో ఉన్నది.
Also Read: ‘జై భీమ్’ లో ‘సినతల్లి’ పాత్ర చేసిన ఈ నటి గురించి మీకు తెలియని విషయాలు ఏంటంటే..?