Advertisement
ఒకసారి గెలవడం అంటే అవకాశం, రెండవసారి నిలవడం అంటే నమ్మకం, మూడోసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా? అవును మూడుసార్లు గెలవడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట, దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మేజిక్ అని చెప్పాల్సిందే. ఇప్పటివరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్ తో సహా అనేకమంది ఉన్నారు. అలా, ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన నాయకుల లిస్టు ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also: రైళ్ల పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు ఉంటాయి ? అవి లేకుంటే కలిగే నష్టం ఇదేనా ?
1. పవన్ కుమార్ చామ్లింగ్
రాష్ట్రం: సిక్కిం
సీఎం పదవీకాలం: 24 ఏళ్ల 166 రోజులు
పార్టీ: సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్
2. జ్యోతి బసు
రాష్ట్రం: పశ్చిమ బెంగాల్
సీఎం పదవీకాలం: 23 ఏళ్ల 138 రోజులు
పార్టీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
3 నవీన్ పట్నాయక్
రాష్ట్రం: ఒడిశా
సీఎం పదవీకాలం: 22 ఏళ్ల 361 రోజులు
పార్టీ: బిజూ జనతాదళ్
4. గెగాంగ్ అపాంగ్
రాష్ట్రం: అరుణాచల్ ప్రదేశ్
సీఎం పదవీకాలం: 22 ఏళ్ల 250 రోజులు
పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
అరుణాచల్ కాంగ్రెస్
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
భారతీయ జనతా పార్టీ
భారత జాతీయ కాంగ్రెస్
Advertisement
5. లాల్ థన్హావ్లా
రాష్ట్రం: మిజోరం
సీఎం పదవీకాలం: 22 ఏళ్ల 60 రోజులు
పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. వీరభద్ర సింగ్
రాష్ట్రం: హిమాచల్ ప్రదేశ్
సీఎం పదవీకాలం: 21 ఏళ్ల 13 రోజులు
పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7. మాణిక్ సర్కార్
రాష్ట్రం: త్రిపుర
సీఎం పదవీకాలం: 19 ఏళ్ల 363 రోజులు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
8. ఎం. కరుణానిధి
రాష్ట్రం: తమిళనాడు
సీఎం పదవీకాలం: 18 ఏళ్ల 362 రోజులు
పార్టీ: ద్రవిడ మున్నేట్ర కజగం
9. ప్రకాష్ సింగ్ బాదల్
రాష్ట్రం: పంజాబ్
సీఎం పదవీకాలం: 18 ఏళ్ల 350 రోజులు
పార్టీ: శిరోమణి అకాలీదళ్
10 యశ్వంత్ సింగ్ పర్మార్
రాష్ట్రం: హిమాచల్ ప్రదేశ్
సీఎం పదవీకాలం: 18 ఏళ్ల 83 రోజులు
పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11. శ్రీ కృష్ణ సిన్హా
రాష్ట్రం: బీహార్
సీఎం పదవీకాలం: 17 ఏళ్లు, 42 రోజులు
భారత జాతీయ కాంగ్రెస్
12. మోహన్ లాల్ సుఖాడియా
రాష్ట్రం: రాజస్థాన్
సీఎం పదవీకాలం: 16 ఏళ్ల 194 రోజులు
పార్టీ: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 ఎన్. చంద్రబాబు నాయుడు
రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
సీఎం పదవీకాలం: 13 ఏళ్ల 247 రోజులు
పార్టీ: తెలుగుదేశం పార్టీ
Read also: ప్రభాస్ తండ్రి, తారకరత్న, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఉన్న కామన్ పాయింట్ ఇదేనా ?