Advertisement
వేసవికాలం వచ్చేసింది. ఇప్పటికే ఎండ తాపం పెరిగిపోయింది . ఎండ నుంచి కాపాడుకోవడానికి ఫ్యాన్ సరిపోవడం లేదు. దీంతో చాలామంది ఏసీ పెట్టుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఏసీ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతున్నారు. అలాంటివారు ఈ ఐదు పద్ధతులతో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం..
Advertisement
also read: జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లు..వదిలిపెట్టకుంటే విచారం తప్పదు..?
పవర్ బటన్ ను ఆఫ్ చేయాలి :
మనం ఏసీ ని ఆఫ్ చేసినప్పుడు పవర్ బటన్ ఆఫ్ లో ఉందా లేదా ఆన్ లో ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది రిమోట్ తోనే ఏసీ ని ఆఫ్ చేసి పవర్ బటన్ ను మాత్రం అలా వదిలేస్తారు. దీనివల్ల అదనపు కరెంటు ఖర్చు అవుతుంది. బిల్లు పెరిగిపోతుంది. కాబట్టి పవర్ బటన్ ఆఫ్ చేయాలి.
సరైన టెంపరేచర్ సెట్ చేయాలి:
ఏసీ ని ఎప్పుడైనా నిర్దిష్ట టెంపరేచర్ వద్ద సెట్ చేయడం మంచిది. తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీని రన్ చేయకూడదు. 15 నుంచి 16 డిగ్రీల వద్ద సెట్ చేస్తే కరెంట్ బిల్లు వాచిపోతుంది. కాబట్టి ఏసీ 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. దీనివల్ల బిల్ ఎక్కువ రాదు.
Advertisement
also read:పడుకునే టైంలో ఫోన్ తలపక్కన పెట్టుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..?
ఏసీ సర్వీసింగ్:
ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే ఉపయోగించగానే సరిపోదు. వాటిని సర్వీసింగ్ కూడా చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న గాడ్జెట్ లు ఎక్కువగా పని చేస్తాయి. కరెంటు కూడా ఆదా చేస్తాయి.
also read: ఇండియన్ టాయిలెట్ మరియు వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెటరంటే..?
కిటికీలు, తలుపులు మూసివేయండి:
ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయాలి. లేదంటే బయట గాలి లోపలికి వచ్చిన లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్ చేసి వేస్ట్. కరెంట్ ఖర్చు కూడా పెరిగిపోతుంది.