Advertisement
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు కామనే. ఇప్పటికీ పాడుబడిన భవనాలు వాడడమే అందుకు కారణం. హాట్టల్స్, హాస్పిటల్స్, ఆఫీసులు ఇలా ఎన్నో పూర్వకాలం భవంతుల్లోనే కొనసాగుతున్నాయి. దీనివల్ల పాములు, ఎలుకలు తరచూ దర్శనం ఇస్తుంటాయి. అయితే.. ఆస్పత్రుల్లో పేషెంట్లను ఎలుకలు కొరికేయడం అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులను ఎలుకలు భయబ్రాంతులకు గరిచేశాయి.
Advertisement
ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయి. కాకతీయ యూనివర్సిటీ మహిళల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఎలుకల వల్లే తమకు గాయాలయ్యాయని విద్యార్థినులు వణికిపోయారు. పద్మాక్షి హాస్టల్ ‘డి’ బ్లాక్ లోని రూం నెంబరు-7లో ఇద్దరు విద్యార్థినులు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పారిశుద్ధ్యం లోపించించడం.. పనికిరాని వస్తువులన్నీ నిల్వ చేయడం వల్లే ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థినులు అంటున్నారు.
Advertisement
ఎలుకలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. దీనిపై ఎన్నోసార్లు హాస్టల్స్ కేర్ టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కానీ, ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కొన్నాళ్ల క్రితం వరంగల్ ఎంజీఎంలో పేషెంట్ ను ఎలుకలు కొరికిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. అనేక విమర్శలు రావడంతో ఎలుకల బెడద ఉందని సూపరింటెండెంట్ శ్రీనివాసరావు చెప్పారు. వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఇష్యూపై మంత్రి హరీష్ రావు సైతం స్పందించి సీరియస్ అయ్యారు. ఇప్పుడు యూనివర్సిటీలోని హాస్టల్ లో ఎలుకలు విద్యార్థినులను కొరకడం హాట్ టాపిక్ గా మారింది.