Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది రమ్యకృష్ణ. ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో రమ్యకృష్ణ యువకుల కలల రాకుమారిగా ఉండేది. అలాంటి ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంది. అయితే రమ్యకృష్ణ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది.
Advertisement
Also Read: కమెడియన్ రఘు ఇల్లు చూశారంటే దిమ్మ తిరిగిపోద్ది..!!
దీంతో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా ముద్రపడింది. ఇక ఈమె ఇండస్ట్రీలో కొనసాగదు అనే టైంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ఆమె రేంజ్ మారింది అని చెప్పవచ్చు. అల్లుడుగారు సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో రమ్యకృష్ణ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా చేసింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రమ్యకృష్ణ కృష్ణవంశీతో ప్రేమలో పడింది..
Advertisement
Also Read: ఆ వ్యక్తి లేకుంటే సుమన్ హీరో అయ్యేవారు కాదట..!!
అది కూడా ఒక కమెడియన్ మధ్యలో ఉండి వీరి ప్రేమకు సహకరించారు.. మరి ఆ ప్రేమ వ్యవహారం ఏంటో పూర్తిగా చూద్దాం.. ఇండస్ట్రీలోకి కృష్ణవంశీ గులాబీ అనే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత సింధూరం, నిన్నే పెళ్ళాడుతా,ఖడ్గం అనే బ్లాక్ బాస్టర్ చిత్రాలు అందించారు. అయితే ఆయన ముందుగా చేసిన గులాబీ చిత్రంలో మేఘాలలో తేలిపొమ్మన్నది అనే పాట అప్పట్లో చాలా హిట్ అయింది. ఈ సాంగ్ విన్న రమ్యకృష్ణ చాలా అట్రాక్ట్ అయింది.
ఈ సాంగ్ ను చిత్రీకరించింది ఎవరు అనే విషయాలు తెలుసుకొని ఆయనను కలవడం కోసం కమెడియన్ బ్రహ్మానందం సహకారం తీసుకుంది. ఆయనను ఓసారి కలిసింది. అలా వీరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటిస్తూ ఇప్పటికి ఇండస్ట్రీ లోనే కొనసాగుతుంది.
Also Read:తారకరత్న తల్లిదండ్రులు అలేఖ్య రెడ్డిని ఇక జీవితంలో క్షమించరా..?