Advertisement
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. టిడిపి సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి – భూమా శోభా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె భూమ మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్నారు. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మనోజ్ – మౌనిక ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
Read also: “నువ్వు నాకు నచ్చావ్” ఎన్నో టైమ్స్ చూసాము ఈ తప్పుని ఎప్పుడైనా గమనించారా ?
అయితే మంచు మనోజ్ ఈ పెళ్లి చేసుకోవడానికి ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ ఈ విధంగా చేసి ఉండవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే గతంలో పలు రాజకీయ అంశాలపై కూడా మనోజ్ స్పందించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచే మనోజ్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్నట్లుగా కథనాలు వచ్చాయి. ఈ విషయంలో రకరకాల నెగిటివ్ కామెంట్స్ రావడంతో వీటిపై మనోజ్ చాలా సింపుల్ గానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ అంశంపై స్పందించారు మనోజ్.
Advertisement
తనకి రెగ్యులర్ పాలిటిక్స్ లోకి వచ్చే ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే ప్రజాసేవలో మాత్రం తాను ఎప్పటిలాగానే చాలా బిజీగా ఉంటానని వివరణ ఇచ్చారు. ఆ ఆలోచన విధానమే మా ఇద్దరినీ ఈరోజు ఒకటి చేసిందని, కానీ ఒకవేళ మౌనిక రాజకీయాలలోకి వెళతాను అంటే తన ఇష్ట ప్రకారం వెళ్లినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మౌనిక రాజకీయాలలోకి వెళితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. వీలైనంతవరకు కలసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తమకు ఉందని తెలిపారు మంచు మనోజ్. అంతేకాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Read also: మన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకునే సమయానికి వీరి ఏజ్ ఎంతంటే ?